అశ్లీలత లేని హాస్యంతో లిటిల్ హార్ట్స్‌‌‌‌

అశ్లీలత లేని హాస్యంతో లిటిల్ హార్ట్స్‌‌‌‌

యూత్‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌ను ఆకట్టుకునేలా ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ఉంటుందని - నిర్మాతలు  బన్నీవాస్, వంశీ నందిపాటి అన్నారు. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాడ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌‌గా రిలీజ్ చేస్తున్నారు. 

సెప్టెంబర్ 5న సినిమా విడుదల  కానున్న సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ ‘90స్  మిడిల్ క్లాస్ బయోపిక్‌‌ రూపొందించిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే ఇదొక మంచి ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా  భావించాం.  

అది  స్కూల్ బ్యాక్‌‌డ్రాప్ అయితే, ఇందులో ఇంటర్, ఎంసెట్ ఎగ్జామ్స్ బ్యాక్‌‌డ్రాప్ ఉంటుంది. మౌళి పోషించిన అఖిల్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది.  కంటెంట్ బాగుంది కాబట్టే  థియేట్రికల్‌‌గా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇందులో అందరూ కొత్తవాళ్లు, ఓటీటీలో పరిచయమైన వాళ్లు కావడంతో   ఓపెనింగ్స్ నెమ్మదిగానే ప్రారంభమవుతాయని అనుకుంటున్నాం.  

అయితే మ్యాట్నీ,  ఫస్ట్ షో నుంచి కలెక్షన్స్ పికప్ అవుతాయనే నమ్మకం ఉంది. యూత్‌‌ కంటెంట్‌‌తో ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా సాగుతుంది.  ఎక్కడా అశ్లీలత ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్స్‌‌లో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది’ అని అన్నారు.