అమెరికాలో మార్మోగుతున్న ‘లివ్ ఫ్రీ అర్ డై’నినాదం

అమెరికాలో మార్మోగుతున్న ‘లివ్ ఫ్రీ అర్ డై’నినాదం
  • లాక్ డౌన్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు

కాంకర్డ్ (అమెరికా): లాక్ డౌన్ కు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా సిటీల్లో వందలాది మంది రోడ్లపైకి వచ్చి ‘లివ్ ఫ్రీ అర్ డై’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.న్యూహ్యాంప్ షైర్ స్టే్ట్ లోని కాంకర్డ్ సిటీలో 400 మంది మంచు వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నా చేశారు. చాలా మంది కార్లలో కూర్చుని నిరసన తెలిపారు. తమ స్టేట్ లో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయని, అవసరం లేకున్నా క్వారంటైన్ పొడిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. కొందరు మిలటరీ డ్రెస్ లలో మాస్కులు పెట్టుకుని తుపాకులతో ధర్నాలో పాల్గొన్నారు. టెక్సాస్ లో 250 మంది ఆందోళన చేశారు. ‘ఎకనామీ రీఓపెన్ కు ఇదే సమయం, పని చేసేందుకు మమ్మల్ని అనుమతించాలి’ అంటూ నినాదాలు చేశారు. మేరీలాండ్ లో ఆందోళనకారులు కరోనా మాత్రమే కాదు పేదరికం కూడా మనుషుల్ని చంపేస్తుందంటూ నినాదాలు చేశారు. మేరీ ల్యాండ్ లో అమెరికా నేషనల్ ఫ్లాగ్ ను పట్టుకుని నిరసన తెలిపారు. మిచిగన్ క్యాపిటల్ లాన్సింగ్ లో ఇటివల జరిగిన ఆందోళనలో అత్యధికంగా 3 వేల మంది పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అమెరికాలో లా క్ డౌన్ విధించారు. నిత్యావసర వస్తువులు మినహా ఇతర వ్యాపారాలను పూర్తిగా మూసివేశారు. త్వరలో పరిస్థితి కుదుపటపుతుందని, ఎకానమీని రీఓపెన్ చేసేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కొత్త గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే లాక్ డౌన్ సడిలిస్తే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తు్న్నారు. అమెరికాలో 7.38 లక్షల మందికిపైగా కరోనా సోకగా 39,015 మంది చనిపోయారు.