హైదరాబాద్ టాక్సీలపై IPL స్కోర్ బోర్డ్

హైదరాబాద్ టాక్సీలపై IPL స్కోర్ బోర్డ్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పదకొండు సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని 12వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ లీగ్‌కు ఆదరణ అంతా ఇంతా కాదు. IPL 2019 సీజన్‌ క్రికెట్‌ అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లను చూసేందుకు ఇప్పటికే అభిమానులు పెద్దఎత్తున స్టేడియాలకు చేరుకుంటున్నారు. తమ జట్లకు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతున్నారు. IPL మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూడలేని అభిమానుల కోసం … హైదరాబాద్‌ టాక్సీలు వినూత్న ప్రచారాన్ని చేపట్టాయి. నగరంలో పలు టాక్సీలు తమ రూట్‌ టాప్‌ పైభాగంలో IPL 2019 సీజన్‌లో మ్యాచ్‌లకు సంబంధించి స్కోరు కార్డు వివరాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ స్కోరు కార్డుని చూసిన ఓ వ్యక్తి దాన్ని ఫోటో తీసి తన ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫొటోని చూసిన ICC కూడా ముచ్చట తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

ఇప్పటికే…IPL 2019 సీజన్‌కు ప్రచారం కల్పించేందుకు తమకు అందివచ్చిన అన్ని మార్గాలను టోర్నీ నిర్వాహకులు వినియోగించుకుంటున్నారు. IPL మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూడలేని అభిమానుల కోసం టీవీ చానళ్లు, హాట్‌స్టార్‌ లాంటి ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ చానళ్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు పలురకాల క్రికెట్‌ వెబ్‌సైట్లు కూడా మ్యాచ్‌లకు సంబంధించిన స్కోరు కార్డుని ప్రదర్శిస్తున్నాయి.