ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగబోయే వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆదివారం (నవంబర్ 30) జరుగుతుంది. రోహిత్, కోహ్లీ స్వదేశంలో ఆడుతుండడంతో ఈ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. రాంచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా జట్టును లీడ్ చేయనున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కుర్రాళ్ళు సీనియర్లతో కూడిన భారత జట్టు స్వదేశంలో చెలరేగేందుకు సిద్ధంగా ఉంది.
మరోవైపు టెంబా బావుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా స్వదేశంలో భారత వన్డే జట్టుకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇటీవలే టీమిండియాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత సౌతాఫ్రికా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది. ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 94 వన్డే మ్యాచ్ లు జరిగాయి. వీటిలో సౌతాఫ్రికా 51 విజయాలతో ఆధిక్యంలో ఉంది. ఇండియా 40 సాధించగా.. మూడు మ్యాచ్ ల్లో ఫలితం రాలేదు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది.
షెడ్యూల్, టైమింగ్:
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతాయి. తొలి మూడు వన్డేలకు వరుసగా రాంచీ, రాయ్‌పూర్,విశాఖపట్నం ఆతిధ్యమిస్తాయి. వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు జరుగుతాయి. వన్డే సిరీస్ తర్వాత భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.
లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:
మూడు వన్డేలు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగుతాయి. మధ్యాహ్నం 1:00 గంటలకు వేస్తారు.
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మూడు వన్డేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది
లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
సౌతాఫ్రికాతో మూడు వన్డేలకు భారత జట్టు:
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్
సౌతాఫ్రికా జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, డెవాల్డ్ బ్రీవిస్ , నాండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మాన్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బోష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడిన్, ర్యాన్నే రిక్కెల్టన్, ప్రెయాన్ రిక్లెన్‌రేన్
