లిజ్​ ట్రస్కు​ జీవితాంతం ఏటా రూ.కోటి అలవెన్స్

 లిజ్​ ట్రస్కు​ జీవితాంతం ఏటా రూ.కోటి అలవెన్స్

లండన్​: బ్రిటన్​ ప్రధాని పదవిలో ఉన్నది కేవలం 45  రోజులే అయినా లిజ్​ ట్రస్​ జీవితాంతం పెన్షన్​ పొందనున్నారు. ఏటా 115 వేల పౌండ్లను ఆమె అందుకుం టారని సమాచారం. దీనిపై బ్రిటన్​లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్​కు ఈ భత్యం చెల్లించొద్దని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు. ఇప్పటికే అతి తక్కువ కాలం పదవిలో ఉన్న చెత్త రికార్డును మూటగట్టు కున్న ట్రస్.. స్వచ్ఛందంగా ఈ భత్యాన్ని వదులుకోవాలని బ్రిటన్​ పౌరులు కోరుతు న్నారు.

ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించిన వారికి ‘పబ్లిక్​ డ్యూటీ కాస్ట్​ అలవెన్స్(పీడీసీఏ)’ కింద ఏటా నిర్ణీత మొత్తం చెల్లించే సాంప్రదాయం బ్రిటన్​లో కొనసాగుతోంది. పదవీ కాలం తర్వాత కూడా మాజీ ప్రధానులు ప్రజలకు సేవలు అందించేందుకు ఉద్దేశించిన అలవెన్స్ ఇది. 1991 లో మాజీ ప్రధాని మార్గరెట్​ థాచర్​ సూచనలతో ఈ అలవెన్స్​ను ఏర్పాటు చేశారు.