
హైదరాబాద్, వెలుగు: యాక్సిస్ బ్యాంక్, తన భాగస్వామి ఫ్రీచార్జ్‌తో కలిసి ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా బంగారంపై తీసుకునే లోన్ను డబ్బును నేరుగా గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా వాడుకోవచ్చు.
సాధారణంగా గోల్డ్ లోన్ తీసుకుంటే, ఆ డబ్బు కస్టమర్ బ్యాంకు ఖాతాలో పడుతుంది. ఈ విధానంలో డబ్బును ఓవర్‌డ్రాఫ్ట్ విధానంలో ఇస్తారు. దీనిని యూపీఐ ద్వారా వెంటనే ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ బంగారంపై అప్పు తీసుకొని, ఆ డబ్బును నేరుగా యూపీఐ చెల్లింపుల కోసం వాడుకోవచ్చు.
ఈ విధానం పూర్తిగా డిజిటల్, అని బ్రాంచ్‌కు వెళ్లకుండానే డబ్బు పొందవచ్చని యాక్సిస్ తెలిపింది. వాడుకున్న డబ్బుకు మాత్రమే వడ్డీ పడుతుంది. ఉదాహరణకు రూ.ఐదు లక్షల ఓడీలో రూ.50 వేలు వాడుకుంటే.. ఈ మొత్తానికే వడ్డీ కడితే చాలు.