తక్కువ వడ్డీ అనగానే.. హడావుడి లోన్లు వద్దు

V6 Velugu Posted on Nov 29, 2021

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: కొన్ని మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఇచ్చే లోన్లతో కస్టమర్ల జేబులు గుల్ల అవుతున్నాయనే కంప్లైంట్లు ఎక్కువయ్యాయి. విపరీతమైన వడ్డీలు, మోసపూరితంగా చార్జీలను వసూలు చేస్తున్నారని, కిస్తీలు లేటైతే బారోవర్లను వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆర్‌‌‌‌బీఐ  అప్రమత్తమైంది. ఇల్లీగల్‌‌‌‌ యాప్‌‌‌‌లు లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. మనదేశంలో దాదాపు 1,100 ఆన్‌‌‌‌లైన్ లోన్ యాప్‌‌‌‌లు ఉన్నాయని వెల్లడించింది. మరో సంగతి ఏమిటంటే  దాదాపు 80 ఆండ్రాయిడ్ స్టోర్లలోని ఈ యాప్‌‌‌‌లలో దాదాపు 600 వరకు చట్టవిరుద్ధమేనవే! ఇలాంటి లెండింగ్ యాప్‌‌‌‌లను కంట్రోల్‌‌‌‌ చేయడానికి ఆర్‌‌‌‌బీఐ వర్కింగ్ గ్రూప్‌‌‌‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి స్కామ్‌‌‌‌లను నిరోధించడానికి ఈ యాప్‌‌‌‌లకు వెరిఫికేషన్‌‌‌‌కు తప్పనిసరి  చేయాలని సిఫార్సు చేసింది.  కిస్తీలను వసూలు చేయడానికి డిజిటల్‌‌‌‌ యాప్‌‌‌‌లు అక్రమపద్ధతులను అనుసరించడం, వేధించడం, విపరీతమైన వడ్డీలను చేయడంతో ఆర్‌‌‌‌బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. డిజిటల్ లోన్లలో స్కామ్‌‌‌‌లే ఎక్కువని ఫైనాన్షియల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్టులు చెబుతున్నారు. కాబట్టి డీఏల్‌‌‌‌ఏల నుంచి,  డిజిటల్ లోన్ యాప్‌‌‌‌ల నుండి లోన్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

రూల్స్‌‌‌‌ను  షరతులను చదివి అర్థం చేసుకోండి
'ప్రొసీడ్' బటన్‌‌‌‌పై క్లిక్ చేసే ముందే లోన్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది అన్నిటికీ ముఖ్యమైనది. డిజిటల్ లోన్ యాప్‌‌‌‌ల రూల్స్‌‌‌‌ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్‌‌‌‌. ఒక నిర్ణయానికి వచ్చే ముందు రూల్స్‌‌‌‌ను, షరతులను పూర్తిగా చదవాలి. లేకపోతే ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి.

వివరాలు ఇవ్వొద్దు..
టెక్నాలజీ వాడకం పెరగడం వల్ల లోన్ల స్కామ్‌‌‌‌లు పెరిగాయి.  సైబర్ నేరాలూ ఎక్కువయ్యాయి.  రెగ్యులేటర్ల అప్రూవల్‌‌‌‌ లేని లోన్ యాప్‌‌‌‌లకు దూరంగా ఉండాలి. బ్యాంక్ వివరాలు, క్రెడిట్ కార్డ్ పిన్ లేదా అడ్రస్‌‌‌‌ల వంటి వ్యక్తిగత వివరాలను అడిగే డిజిటల్ లోన్ యాప్‌‌‌‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రూల్స్‌‌‌‌ ప్రకారం నడుచుకునే లోన్‌‌‌‌ యాప్‌‌‌‌లు ఇలాంటి సున్నితమైన సమాచారం అడగవు.

తక్కువ వడ్డీకి ఆశపడొద్దు..
తక్కువ వడ్డీ రేట్ల ఉన్నాయి కదా అని హడావుడిగా లోన్లు తీసుకోవద్దు. కొన్ని యాప్‌‌‌‌లు వడ్డీరేట్లను తక్కువగా చూపినా..  ప్రీ-పేమెంట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా ప్రీ-క్లోజర్ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తాయి. ఇలాంటి యాప్‌‌‌‌లకు దూరంగా ఉండటమే మేలు.

రెడ్‌‌‌‌ ఫ్లాగ్స్‌‌‌‌ కోసం చూడండి
ఆర్‌‌‌‌బీఐ రూల్స్‌‌‌‌ను పాటించే నమ్మకమైన డిజిటల్ లోన్ యాప్‌‌‌‌లకు వెబ్‌‌‌‌సైట్లు ఉంటాయి. స్కామర్ల యాప్‌‌‌‌లకు సాధారణంగా వెబ్‌‌‌‌సైట్ కూడా ఉండదు. వాటిలో కొన్ని లిస్ట్‌‌‌‌ అయి కూడా ఉంటాయి. అయినప్పటికీ ఇవి స్కామర్ల చేతుల్లో లేవని రూడీ చేసుకోవడానికి  వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి.  ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు యాప్ స్టోర్‌‌‌‌లో యాప్ రివ్యూలను కూడా చదవాలి. లోన్‌‌‌‌ ఇచ్చే యాప్ ఏదైనా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో కలిసి పనిచేస్తుందో లేదో చూడాలి. అది ఆర్‌‌‌‌బీఐ లేదా బ్యాంక్‌‌‌‌లో రిజిస్టర్‌‌‌‌ అయిన ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీయా కాదా ? అనేది చెక్‌‌‌‌ చేయాలి. అవసరమనుకుంటే సంబంధిత ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ ఆఫీసుకు వెళ్లి సమాచారం కనుక్కోవాలి.

ఆర్‌‌‌‌బీఐ అప్రూవల్‌‌‌‌ ఉందో లేదో చూడాలి
మీకు లోన్‌‌‌‌ ఇస్తున్న యాప్‌‌‌‌/లెండర్‌‌‌‌ ఆర్‌‌‌‌బీఐలో రిజిస్టర్ అయిందో లేదో తప్పనిసరిగా తెలుసుకోవాలి.  సంబంధిత యాప్‌‌‌‌/క్రెడిటర్‌‌‌‌ ఎంతవరకు నమ్మకస్తుడో చూడాలి. పేరున్న కంపెనీ అయితే  లోన్‌‌‌‌ తిరిగి చెల్లించేటప్పుడు ఎటువంటి సమస్యలూ ఉండవు. అడ్డగోలు చార్జీలు ఉండవు. ఆర్‌‌‌‌బీఐ  కేవైసీ రూల్స్‌‌‌‌ను పాటించని యాప్‌‌‌‌లకు దూరంగా ఉండాలి. ఇవి సెంట్రల్ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించవు.
 

Tagged online loan apps, Loan Apps, Loan Frauds, online loans, fraud online apps

Latest Videos

Subscribe Now

More News