కస్లమర్లను వేధిస్తున్న లోన్ యాప్స్ నిర్వాహకులు

కస్లమర్లను వేధిస్తున్న లోన్ యాప్స్ నిర్వాహకులు

హైదరాబాద్: లోన్ యాప్స్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో లోన్లు తీసుకున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు విషయాలను సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.  కొన్ని రోజుల వ్యవధిలోనే 50 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 291 కొత్త లోన్ యాప్స్ ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్లేస్టోర్ నుంచి ఆ యాప్స్ ను తొలగించాలని గూగుల్ అధికారులకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. యాప్లల్లో రుణాలు తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించారు. ఒక్కసారి రిజిస్టర్ అయితే కాంటాక్టులన్నీ కేటుగాళ్ల చేతుల్లోకి పోతాయని అప్రమత్తం చేశారు. లోన్ యాప్స్ కేసులో ప్రధాని నిందితురాలు జెన్నిఫర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం...

ఉగాది తర్వాత వడ్ల ఉద్యమం

ఐదుసార్లు అవమానించినా భరించినం