సెప్టెంబర్ ఫస్ట్ వీక్‎లో స్థానిక ఎన్నికల షెడ్యూల్.. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్..!

సెప్టెంబర్ ఫస్ట్ వీక్‎లో  స్థానిక ఎన్నికల షెడ్యూల్.. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్..!
  • తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ చాన్స్
  • బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం
  •  దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే.. అది ఆగిపోతే, పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం 
  • ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం 
  • సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలలోనే నిర్వహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలతో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణ, తుది జాబితా ప్రచు రణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ల అమలు కోసం ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూవచ్చింది. కానీ, అసెంబ్లీలో ఆమోదించి పంపిన బీసీ బిల్లులు. పం చాయతీరాజ్ చట్టం 2018కి చేసిన సవరణ ఆర్ధి నెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పడింది. 

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ కు సుప్రీంకోర్టు విధించిన గడువు కేసు విచారణకు హాజరైన రాష్ట్ర ప్రభుత్వం తన అభి ప్రాయాన్ని వెల్లడిం చింది. కానీ, ఆ కేసు ఎప్పటి వరకు కొన సాగుతుందో తెలియదు. అయితే.. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్నది. 

పంచాయతీల్లో పాలక వర్గాలు లేక పోవడంతో ఏడాదిన్నర నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామాలకురావాల్సిన రూ.2,600కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తు న్నది.

 ఒకవేళ దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే, అధికార పార్టీపరంగా 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామని ప్రకటించి, మిగతా పార్టీలు కూడా అమలు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో అప్పీల్ చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే బీజేపీ కూడా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. 

వారం వ్యవధిలో..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే సర్పంచ్​ ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ వర్గాలు వెల్లడించాయి.  

దీంతో సెప్టెంబర్​ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఆ తర్వాత అక్టోబర్​ మొదటి వారంలో సర్పంచ్​ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల శిక్షణ పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్​ నుంచి బ్యాలెట్​ బాక్సులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై గెజిట్​ నోటిఫికేషన్​ ఇచ్చి.. ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే.. దాని ప్రకారం షెడ్యూల్​ నోటిఫికేషన్​ ఇవ్వనున్నారు. 

సెప్టెంబర్ 2న ఓటరు తుది జాబితా

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా.. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణ, ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ రాణి కుముదిని మంగళవారం నోటిఫికేషన్​ జారీ చేశారు. వార్డుల వారీగా పోలింగ్​ కేంద్రాలు, ఓటరు జాబితాలు, ఎంపీటీసీల పోలింగ్​ కేంద్రాలు సిద్ధం చేయాలని  కలెక్టర్లు, జిల్లా ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించారు. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాల్టీలను ప్రకటించడంతో 71 పంచాయతీలు మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో విలీనమయ్యాయి. దీంతో పోలింగ్​ స్టేషన్లు, ఓటరు జాబితాలో మార్పులు చోటుచేకున్నాయి. దీనికితోడు 18 ఏండ్లు నిండినవారు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్యలో కూడా తేడాలు వచ్చాయి. చనిపోయినవారి వివరాలను  ఓటరు జాబితా నుంచి తొలగించారు. 

దీంతో తాజాగా ఓటరు జాబితా, పోలింగ్​ స్టేషన్ల వివరాలను రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 28న వార్డులవారీగా ఓటరు జాబితాలను గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు.  29న జిల్లాస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు, 30న మండల స్థాయి ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 

గ్రామీణ, అసెంబ్లీ ఓటర్లను వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలోకి పునః సర్దుబాటు చేయడంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28 నుంచి 30 వరకు స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఈ నెల 31లోపు పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 2 ఓటరు తుది జాబితా ప్రకటిస్తారు. 

వారం వ్యవధిలో..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్నీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 

దీంతో సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఆ తర్వాత అక్టోబర్ మొదటివారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల శిక్షణ పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి... ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే.. దాని ప్రకారం షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

12,760 పంచాయతీలు, 5,763 ఎంపీటీసీలకు ఎన్నికలు 

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీలు, జడ్పీల లెక్క తేలింది. ప్రస్తుతం 12,760 పంచాయతీలు ఉండగా.. 1,12,534 వార్డులున్నాయి. 5,763 ఎంపీటీసీ స్థానాలుండగా.. 565 ఎంపీపీ, జెడ్పీటీసీలు, 31 జడ్పీలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరగనున్నాయి.  2019లో 12,848  పంచాయతీలకు ఎన్నికలు జరగగా..  ప్రస్తుతం వాటి సంఖ్య 12,760కు చేరింది. 

 2019లో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 1,12,534 కు చేరింది. 2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా.. ప్రస్తుతం 5,763కు చేరింది. గతం కంటే 54 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.  ఎంపీపీలు, జడ్పీటీసీలు 539 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 565కు చేరింది. 

 గతం కంటే 26 వరకు ఎంపీపీలు, జడ్పీటీసీలు స్థానాలు  పెరిగాయి.  గతంలో 32 జడ్పీ  స్థానాలు ఉండగా.. 31కి చేరింది. మేడ్చల్ - మల్కాజిగిరి  జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు శివారు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో ఈ జిల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి తెరమరుగైంది.