బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

ఖమ్మం జిల్లా  పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పాలేరులోని 59,60 డివిజన్లలో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు కందాల ఉపేందర్ రెడ్డిని అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న తమకు  ఇక్కడే పట్టాలు ఇవ్వాలని అడ్డుకున్నారు. 

తమను అడ్డుకున్న బాధితులపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే అడ్డుకుంటారా అని కోపానికి వచ్చారు.  అయితే తమ సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదని ..రోడ్డు వెడల్పుతో ఇండ్లు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కందాల ఉపేందర్ రెడ్డి చుట్టపు చూపుగా వస్తున్నారని చెప్పారు. బాధితుల గోడు విన్న కందాల ఉపేందర్ రెడ్డి..న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న ప్రతీ ఒక్కరికి ఇండ్లు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.