ప్రమాదం అంచున ప్రయాణం !

 ప్రమాదం అంచున ప్రయాణం !

కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలంలోని కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లిల మధ్య  ఆర్అండ్​బీ రోడ్డుపై వాగులకు అడ్డంగా 2 చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. బీటీ రోడ్డు వేయకపోవడంతో వాహనాల రాకపోకలతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షానికి నీళ్లు నిలిచి ప్రమాదకరంగా మారాయి. 

ఈ మార్గంలో కామారెడ్డి నుంచి రాజంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాలతో పాటు, మెదక్​ జిల్లాకు వాహనాల రాకపోకలు సాగుతాయి. ఆర్​అండ్​బీ అధికారులు స్పందించి బ్రిడ్జిల వద్ద గుంతలు పూడ్చి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.