
- మహారాష్ట్ర మినిస్టర్ సుభాశ్ దేశాయ్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను ఎక్స్‌టెండ్ చేస్తున్నట్లు మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రి సుభాశ్ దేశాయ్ చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్లేందుకు పరిశ్రమలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆయన అన్నారు. “ ముంబై మెట్రోపాటిలన్ రీజన్, పుణె, షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్‌లోని మాలేగావ్ టౌన్ తదితర ప్రాంతాల్లో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కేంద్రం చెప్పిన విధంగా ఆంక్షలు ఉంటాయి” అని అధికారి ఒకరు చెప్పారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో కెల్లా ముంబైలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.