పవర్ బటన్ నొక్కకుండానే ఫోన్ లాక్ చేయడం ఎలాగో తెలుసా?

పవర్ బటన్ నొక్కకుండానే ఫోన్ లాక్ చేయడం ఎలాగో తెలుసా?

స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌కు లాక్ రకరకాలుగా పెడుతుంటారు. అయితే, ఆ లాక్ తీయాలంటే ముందుగా పవర్ బటన్ ఆన్ చేయాల్సిందే కదా. మరి ఆ బటన్​ పాడైపోతే.. ఎలా?  సాధారణంగా స్మార్ట్​ ఫోన్​లో పర్సనల్ ఫొటోలు, బ్యాంకింగ్ యాప్‌‌‌‌లు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. కాబట్టి ఫోన్‌‌‌‌ను ఎప్పటికప్పుడు లాక్ చేయడం అవసరం. అందరూ పవర్ బటన్ ద్వారానే ఫోన్ లాక్ చేస్తుంటారు. కానీ ఒకవేళ ఆ బటన్ పాడైపోయినా లేదా దాన్ని వాడటం ఇష్టం లేకపోయినా దానికి ఇంకో మార్గం ఉంది. అందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌‌‌‌లో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. 

మొదటి పద్ధతిలో భాగంగా, మీరు ఫోన్ సెట్టింగ్స్‌‌‌‌లోని ‘అడ్వాన్స్‌‌‌‌డ్ ఫీచర్స్’ విభాగంలో ఉన్న ‘మోషన్ అండ్ గెశ్చర్స్’ ఆప్షన్‌‌‌‌ను ఎంచుకోవాలి. అక్కడ స్క్రీన్ ఆన్/ఆఫ్ చేయడానికి ఉన్న ‘డబుల్ ట్యాప్’ టోగుల్‌‌‌‌ను ఆన్ చేసుకోవాలి. దాంతో కేవలం స్క్రీన్ మీద రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు.. ఫోన్​ను ఈజీగా లాక్ చేయొచ్చు/ తీయొచ్చు. ఇక రెండో పద్ధతిలో యాక్సెసిబిలిటీ సెక్షన్‌‌‌‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌‌‌‌లోని ‘యాక్సెసిబిలిటీ’ కి వెళ్లి, ‘ఇంటరాక్షన్ అండ్ డెక్స్​టరిటీ’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న ‘అసిస్టెంట్ మెనూ’ని ఆన్ చేస్తే మీ హోమ్ స్క్రీన్ మీద ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు వచ్చే ఆప్షన్లలో ‘స్క్రీన్ ఆఫ్’ అనే బటన్‌‌‌‌ను నొక్కడం ద్వారా పవర్ బటన్ అవసరం లేకుండానే ఫోన్ లాక్ అయిపోతుంది. ఈ సెట్టింగ్స్ ప్రధానంగా శాంసంగ్ ఫోన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటాయి. ఈ విధంగా మీ ఫోన్‌‌‌‌ను సేఫ్​గా, స్మార్ట్‌‌‌‌గా వాడుకోవచ్చు.