తెలంగాణ‌లో లాక్‌ డౌన్ పొడిగింపు

V6 Velugu Posted on May 18, 2021

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కంట్రోల్ కోసం ఈ నెల 22 వ‌ర‌కు 10 రోజుల లాక్ డౌన్ విధించ‌గా..మంగ‌ళ‌వారం దాన్ని మే-30 పొడిగించింది. లాక్ డౌన్ పొడిగింపుపై మంత్రుల అభిప్రాయాల‌ను తెలుసుకున్న సీఎం కేసీఆర్..ఈ నెల 30 వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌న్నారు. దీంతో ఈ నెల 20న జ‌ర‌గాల్సిన కేబినెట్ స‌మావేశం కూడా వాయిదా ప‌డింది.   

రాష్ట్రంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు ప్ర‌భుత్వం అవకాశం ఇచ్చింది. లాక్‌డౌన్‌ తాజాగా లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వ‌ర‌కు పొడిగించింది.

Tagged Telangana, lockdown, CM KCR, corona, , Extended

Latest Videos

Subscribe Now

More News