ఢిల్లీ, యూపీల్లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు

ఢిల్లీ, యూపీల్లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు

కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడ అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మరోవారం పొడిగిస్తూ సీఎం కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం మే 10 వరకు విధించిన లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏప్రిల్ 19న లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ, ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగిస్తూ వస్తున్నారు. 

అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం యూపీలో మే10 వరకు లాక్‌డౌన్ విధించారు. అయితే కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ను మరోవారం పాటు మే 17 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.  యూపీలో మొదట  మే 3 నుంచి మే 6 వరకు లాక్‌డౌన్ విధించారు. కానీ, ఆ తర్వాత దాన్ని మే8 వరకు పెంచారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మళ్లీ మే 10 పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ తేదీని కూడా పొడిగిస్తూ మే 17 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.