రంజాన్ సమయంలోనూ లాక్ డౌన్

రంజాన్ సమయంలోనూ లాక్ డౌన్
  • సౌదీ అరేబియా సంచలన నిర్ణయం

రియాద్ : కరోనా కట్టడికి సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. రంజాన్ సమయంలోనూ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రంజాన్ సందర్భంగా ఇచ్చిన సెలవుల్లోనూ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 24 న రంజాన్ పర్వదినం ఉన్నప్పటికీ ఈ నెల 23 నుంచి 27 వరకు లాక్ డౌన్ ఉంటుందని సౌదీ ఇంటీరియల్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి తెలిపారు. ఐతే నిత్యావసరాలకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు. మక్కాలో మాత్రం ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. రంజాన్ సమయంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది. మొదట్లో లాక్ డౌన్ విషయంలో సౌదీ అంతగా కఠినంగా లేదు. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తప్పనిసరిగా లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. కానీ 5 రోజులే లాక్ డౌన్ విధిస్తే ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. రంజాన్ సందర్భంగా జనం పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉన్నందున కరోనా కేసులు పెరుగుతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.