సాదాసీదా వరాల్లేవ్​.. వాతల్లేవ్​ 

సాదాసీదా వరాల్లేవ్​.. వాతల్లేవ్​ 
  •  ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టిన నిర్మల
  • రక్షణ రంగానికి దండిగా నిధులు.. సాగుకు అంతంతే.. హెల్త్, ఇతర సెక్టార్లకు ఫర్వాలేదు​
  • ఐదేండ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం.. కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్​
  • ట్యాక్స్​ స్లాబ్స్​లో ఎలాంటి మార్పుల్లేవ్​.. ఎలక్ట్రిక్​ వాహనాల వాడకానికి ప్రోత్సాహం
  • అంగన్​వాడీ సిబ్బందికి ఆయుష్మాన్​ భారత్​.. ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మల

లోక్​సభ ఎన్నికలకు రెండు నెలల టైమే ఉండటంతో నొప్పించక.. ఒప్పించక సాదాసీదాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​ను తీసుకువచ్చింది. ఎలాంటి వరాలు లేవు.. వాతలూ లేవు. కొత్త పథకాలు లేవు.. సామాన్యులపై పెద్దగా భారమూ లేదు. 2024 ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను గురువారం పార్లమెంట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని, 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్​ ఎదుగుతుందని అన్నారు. పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రజల ఆదాయం 50 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

బడ్జెట్​లో అత్యధికంగా రక్షణ రంగానికి రూ. 6 లక్షల కోట్లకుపైగా కేటాయించారు. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి అంతంత మాత్రంగానే కేటాయింపులు జరిపారు. కొత్తగా 2 కోట్ల మందికి పీఎం ఆవాస్​ యోజన కింద ఇండ్లు కట్టిస్తామని, రూఫ్​టాప్​ సోలార్​ స్కీమ్​ కింద కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్​ అందజేస్తామని ప్రకటించారు. ట్యాక్స్​పేయర్స్​కు గత బడ్జెట్​లోని పద్ధతినే రిపీట్​ చేశారు. రూ. 7 లక్షల వరకు (కొత్త సిస్టమ్ ప్రకారం) పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ట్యాక్స్​ చెల్లింపుల్లో కొంత ఊరట లభిస్తుందని వేతన జీవులు భావించినా.. నిరాశే ఎదురైంది.