అమేధి నుంచి రాహుల్.. రాయబరేలి నుంచి ప్రియాంక పోటీ..?

అమేధి నుంచి రాహుల్.. రాయబరేలి నుంచి ప్రియాంక పోటీ..?

లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి.బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ సన్నాహాల్లో ఉంది. అయితే ప్రధాన పార్టీల్లోని ముఖ్య నేతలు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు  అనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై చర్చలు సాగుతుండగా..కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ నుంచే పోటీచేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా రాహుల్ సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 2019లో అమేధీ లో ఓటమీ తర్వాత రాహుల్ గాంధీ మళ్లీ అదే స్థానంనుంచి పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నట్లు సమాచారం. 

రాహుల్ గాంధీ 2002 నుంచి ప్రాతినధ్యం వహిస్తున్న అమేథీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 2019 లో రాహుల్ గాంధీ అమేథిలో బీజేపీ కి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో అమేథి గెలించి తిరిగి కాంగ్రెస్ కంచుకోటను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇంకా  జరగాల్సి ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ 2002 నుంచి 2019 వరకు అమేథీ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. 

అమేథీ నుంచి రాహుల్ గాంధీ పేరును త్వరలో ప్రకటిస్తారని యూపీ కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ తెలిపారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అమేథి నుంచి మరోసారి స్మృతి ఇరానీని బరిలోకి దింపుతోంది బీజేపీ. ఇటీవల 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో అమేథీ నుంచి స్మృతి ఇరానీకి మరోసారి అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే సోనియాగాంధీ స్థానమైన రాయ్ బరేలి నుంచి ప్రియాంకగాంధీకి సిద్ధమవుతుమన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.