వారేవా : పోలింగ్ కోసం ప్రత్యేక రైళ్లు.. వెళ్లి ఓటేయండి

వారేవా : పోలింగ్ కోసం ప్రత్యేక రైళ్లు.. వెళ్లి ఓటేయండి

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లకు  దక్షిణ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.తాంబరం-కన్యాకుమారి మధ్య, చెన్నై ఎగ్మోర్-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.  నెంబర్ 06001  తాంబరం - కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ స్పెషల్ ఏప్రిల్ 18, 20 తేదీలలో తాంబరం నుండి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.40 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.

నెంబర్ 06002 కన్యాకుమారి - తాంబరం సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఏప్రిల్ 19, 21 తేదీల్లో కన్యాకుమారిలో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.20 గంటలకు తాంబరం చేరుకుంటుంది. నెంబర్ 06003 చెన్నై ఎగ్మోర్ - కోయంబత్తూర్ స్పెషల్ ఏప్రిల్ 18, 20 తేదీలలో చెన్నై ఎగ్మోర్ నుండి సాయంత్రం 4.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది.

నెంబర్ 06004 కోయంబత్తూరు - చెన్నై ఎగ్మోర్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 19. 21 తేదీల్లో కోయంబత్తూరులో రాత్రి 8.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.05 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. ఈ రైళ్లలో రెండు ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, ఏడు స్లీపర్ క్లాస్ కోచ్‌లు & జనరల్ సెకండ్ క్లాస్ ఉంటాయి.   ఈ రైళ్లు తాంబరం, చెంగల్‌పేట్, మేల్మరువత్తూరు, తిండివనం, విల్లుపురం, కడలూరు, చిదంబరం, సిర్కాజి, వైతీశ్వరంకోయిల్, మయిలాడుతురై, కుంభకోణం, పాపనాశం, తంజావూరు, తిరుచ్చి, మనపరై, దిండిగల్, పొలనిపేట, పొలమాడ, ఉద్దన్‌పేట, ఉడన్‌పేట స్టాప్ లలో ఆగుతాయి.