మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్.?

మార్చి 9 తర్వాత  లోక్ సభ ఎన్నికల షెడ్యూల్.?

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాత వచ్చే అవకాశముందని  జోరుగా  ప్రచారం జరుగుతోంది.  ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయని భావిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు  కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రెడీ సిద్దమవుతోంది.  దేశ వ్యాప్తంగా లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. వీటితో పాటు జమ్మూ కశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూ సిద్ధం చేస్తుంది.

మార్చి 8 లేదా 9 మధ్య  ప్రభుత్వ అధికారులతో  సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.   జమ్మూలో  భద్రతా బలగాలపై చర్చించనుంది. తర్వాత మార్చి 12 తర్వాత ఈసీ బృందాలు క్షేత్రస్థాయిలో జమ్మూలో పరిశీలించనుంది.   తర్వాత మార్చి సెకండ్ వీక్ లో షెడ్యూల్ ను ప్రకటించే అవకాశ ఉంది. 2019లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్  మార్చి 10న రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించగా మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.