ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

 ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

లోక్‌సభ, రాజ్యసభలో అభ్యంతరకర పదాలు వాడొద్దని ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్‌ సూచించింది. ఈ మేరకు ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. అయితే దీనిపై విలేకరుల సమావేశంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ  పార్లమెంట్‌లో  ఎలాంటి పదాలపై నిషేధం విధించడం లేదని స్పష్టం చేశారు. కొన్ని పదాలను తొలగించామని, తొలగించిన పదాల సంకలనం మాత్రమే జారీ చేశామని ఓం బిర్లా తెలిపారు.  ‘‘ఏ పదాన్నీ నిషేధించలేదు, 1954 నుండి కొనసాగుతున్న పద్దతి ప్రకారమే పార్లమెంటు కార్యకలాపాల సమయంలో తొలగించాం" అని స్పష్టత ఇచ్చారు. నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దంటూ ఆయన విపక్షాలను కోరారు.

సిగ్గులేదు, ధోకేబాజ్, అసమర్థుడు, నాటకం, నటన, అవినీతి పరుడులాంటి మరిన్ని పదాలను  లోక్‌సభ సెక్రటేరియట్‌ బుక్ లెట్ లో చేర్చింది. కరప్ట్, కవర్డ్, హూలిగనిజం, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, క్రొకొడైల్‌ టియర్స్, బ్లడ్‌షెడ్, డాంకీ, డ్రామా, అప్‌మాన్, కాలా బజారీ, చంచా, చంచాగిరి, అబ్యూస్డ్, చీటెడ్, క్రిమినల్,  గూన్స్,  దలాల్, దాదాగిరీ, లాలీపాప్, వినాశ్‌ పురుష్, ఖలిస్తానీ,  బేహ్రీ సర్కారు, బాబ్‌కట్, జుమ్లాజీవీ, శకుని, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, ఐవాష్, అన్‌ట్రూ, కోవిడ్‌ స్ప్రెడర్, గిర్గిట్, బేచారా, అసత్య, అహంకార్ వంటి ఇంగ్లీషు పదాలను కూడా అందులో చేర్చింది. కాగా ఈనెల 19వ తేదీ నుంచి వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.