తపాస్పల్లి రిజర్వాయర్లోకి గోదావరి జలాలు విడుదల

తపాస్పల్లి రిజర్వాయర్లోకి గోదావరి జలాలు విడుదల

కొమురవెల్లి, వెలుగు: మండలంలోని తపాస్​పల్లి రిజర్వాయర్​లోకి సోమవారం మాజీ ఎమ్మెల్యే, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చొరవతో ఇరిగేషన్​అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. పంపింగ్ కోసం రెండు పైపులు ఉండగా ప్రస్తుతం ఒక పైపు ద్వారా నీటిని విడుదల చేశారు.

.ధర్మసాగర్ నుంచి బొమ్మకూరు రిజర్వాయర్ మీదుగా తపాస్​పల్లి రిజర్వాయర్​లోకి నీళ్లు చేరుతాయి. రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపిన అనంతరం కొమురవెల్లి, చేర్యాల మండలాల్లోని చెరువులు, కుంటలను నింపాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.