
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) కమిషనర్‌గా లోకేష్ కుమార్‌ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం GHMC కమిషనర్ తో పాటు, జలమండలి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న దాన కిషోర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది ప్రభుత్వం. ఇకపై ఆయన జలమండలి కమిషనర్ గా మాత్రమే కొనసాగనున్నారు. ఇక రంగారెడ్డి జేసీగా పనిచేస్తున్న హరీశ్ కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.