లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా

లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగింపు వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు వల్ల పాదయాత్ర తేదీని మార్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ ఉన్నందున యువగళం పాదయాత్ర కొనసాగింపునకు ఆటంకం ఏర్పడింది. ఈ మేరకు యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించాలని అనుకుంటున్నారు. 

అయితే ముందుగా అనుకున్న ప్రకారం.. యువగళం పాదయాత్ర సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు  నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 3వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. లోకేష్ ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందనే పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించినట్టుగా తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రలో ఉంటే.. న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌‌పై సుప్రీం విచారణ తర్వాతే.. లోకేష్ పాదయాత్ర ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.