
దేశమంతటా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొత్తం 542 సెగ్మెంట్లలో ఉదయం 8 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, సర్వీస్ ఉద్యోగుల ఓట్లను లెక్కిస్తారు అధికారులు. కౌంటింగ్ మొదలైన 20 నిమిషాల తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత… నాయకుల కోరిక మేరకు.. ర్యాండమ్ గా ఎంపిక చేసిన 5 వీవీప్యాట్ స్లిప్పులను కౌంట్ చేస్తారు.
17వ లోక్ సభకు దేశమంతటా 7 దశల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 19న పోలింగ్ ముగిసింది. 23న ఇవాళ కౌంటింగ్ తర్వాత సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు అధికారులు.