లండన్ అమ్మాయి, ఆదిలాబాద్ అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన ఆదిలాబాద్ పట్టణానికి సాయిచరణ్ అక్కడే వ్యాపారం చేస్తూ సెటిల్ అయ్యాడు. అక్కడ మియామే అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరు పెద్దలను ఒప్పించి బంధుమిత్రుల సమక్షంలో ఒకటయ్యారు. ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. భాష, ప్రాంతాలు వేరైనా ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, అదిలాబాద్
