ఒక్క చెస్  కాయిన్​ రూ.8.78 కోట్లు

ఒక్క చెస్  కాయిన్​ రూ.8.78 కోట్లు

ఇదో చెస్​ కాయిన్​. ఓ సైనికుడు (పాన్​).  ఈ చెస్​ సైనికుడు సొతెబి సంస్థ వేలంలో 10 లక్షల పౌండ్లకు (సుమారు రూ.8.78 కోట్లు) అమ్ముడైంది. చెస్​ కాయిన్​కు అన్ని కోట్లా అనుకోకండి. ఆ చెస్​ కాయిన్​ వెనక పెద్ద కథే ఉంది. లూయిస్​ చెస్​మెస్​లో ఒక కాయిన్​ ఇది. 12వ శతాబ్దంలో స్కాట్లాండ్​లోని ఔటర్​ హెబ్రైడ్స్​లో లూయిస్​ దీవులకు చెందిన ఫేమస్​ చెస్​బోర్డది. తొలిసారిగా 1831లో ఆ చెస్​మెన్​లోని 93 కాయిన్లను సైంటిస్టులు గుర్తించారు. ఓ గుర్రం, నాలుగు పాన్లు సహా ఐదు కాయిన్లు మిస్సయ్యాయి. ఆ మిస్సయిన వాటిలోని ఒక కాయిన్​ ఇప్పుడు దొరికింది. అదే ఈ కాయిన్​. దానిని ఎడిన్​బర్గ్​కు చెందిన పురాతన వస్తువులను అమ్మే ఓ కుటుంబం ఇంకో పురాతన వస్తువులను అమ్మే డీలర్​ నుంచి 1964లో 5 పౌండ్లకు (సుమారు రూ.440 ఇప్పటిధర ప్రకారం) కొనుగోలు చేసింది. వాల్రస్‌ దంతాలతో దీన్ని తయారు చేశారు.