టోల్ తాట తీస్తుంది : ఈ బ్రిడ్జిపై వెళ్లాలంటే రూ.350 కట్టాలి

టోల్ తాట తీస్తుంది : ఈ బ్రిడ్జిపై వెళ్లాలంటే రూ.350 కట్టాలి

దేశంలోనే  అత్యంత పొడవైన సముద్రపు వంతెన మరికొద్దీ రోజుల్లో ప్రారంభం కానుంది. మహారాష్ట్ర లోని  ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)  వంతెనను ప్రధాని మోదీ 2024 జనవరి 12వ తేదీన ప్రారంభించనున్నారు. 22కిలోమీటర్ల  పొడవైన ఈ వంతెనపై వాహనదారులు ప్రయాణించడానికి సింగిల్ ట్రిప్ కు రూ.  350 చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్రతిపాదనకు  మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 

మందుగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుండి వచ్చిన అంచనాల ఆధారంగా ప్రతి వాహనదారుడికి రూ. 500 టోల్‌ను ప్రతిపాదించింది. అయితే పట్టణాభివృద్ధి శాఖ (UDD) వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని కార్లకు రూ. 350కి సవరించింది. ఈ వంతెనను  రూ.17 వేల 843 కోట్ల వ్యయంతో నిర్మించారు..  మొత్తం 21.8 కిలోమీటర్ల ఈ వంతెన ప్రయాణాన్ని రెండు గంటల నుంచి కేవలం 15-20 నిమిషాలకు తగ్గిస్తుంది.  

ఇది ముంబయిలోని సెవ్రీని నవీ ముంబైలోని చిర్లేను కలుపుతుంది.  ముంబై ట్రాన్స్ హార్బర్ లింగ్ మొత్తం 6 లేన్ల రహదారి. ఇది సముద్రంపై 16.50 కిలోమీటర్ల పొడవు ఉండగా.. నెలపై 5.50 కిలోమీటర్ల పొడవు ఉంది. సముద్రంపై రోడ్డు ప్రయాణ అనుభూతి కోసం ముంబై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.