తిరుమల కొండపై హోటళ్ల దోపిడీకి చెక్

తిరుమల కొండపై హోటళ్ల దోపిడీకి చెక్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి అక్కడి హోటళ్లు. దీంతో భోజనం ,టిఫిన్లు చేద్దామంటే వారికి చుక్కలు కన్పిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించిన దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిర్ణయించిన ధరలకు కాకుండా… ఇష్టాను సారంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం కొండపై రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి ధరలను రూ.7.50, రూ.22.50గా నిర్ణయించింది. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొండపై 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిన్న షాపులున్నాయి. వీటిలో ఎవరైనా నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు అమ్మితే టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేయాలని ఎండోమెంట్స్ విభాగం తెలిపింది.