అమెరికాకు రాహుల్​ గాంధీ

అమెరికాకు రాహుల్​ గాంధీ
  • ఈ నెల 8–10 తేదీల మధ్య టూర్
  • కీలక సమావేశాల్లో పాల్గొననున్న కాంగ్రెస్​ అగ్రనేత

న్యూఢిల్లీ, అనంత్‌‌‌‌‌‌‌‌నాగ్ : కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్షనేత(ఎల్​ఓపీ) రాహుల్ ​గాంధీ సెప్టెంబర్​ 8–10 వ తేదీల మధ్య అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ ​డీసీ, డాలస్​లో జరిగే పలు సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే, టెక్సస్​ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎల్​ఓపీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్​ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను ఇండియన్ ​ఓవర్సీస్ కాంగ్రెస్​ చీఫ్​శ్యాం పిట్రోడా శనివారం వెల్లడించారు. రాహుల్ గాంధీ ఎల్​ఓపీ అయినప్పటి నుంచి ఆయనతో మాట్లాడాలని ఎన్నారైలు, దౌత్యవేత్తలు, విద్యావేత్తలు

బిజినెస్​ పర్సన్స్​, అంతర్జాతీయ మీడియా నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని పిట్రోడా వెల్లడించారు. రాహుల్ ​గాంధీ సెప్టెంబర్ 8న డాలస్‌‌‌‌‌‌‌‌లో, సెప్టెంబర్ 9-–10వ తేదీల్లో వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ డీసీలో ఉంటారని తెలిపారు. డాలస్‌‌‌‌‌‌‌‌లో టెక్సస్ యూనివర్సిటీ స్టూడెంట్స్, విద్యా సంఘం ప్రతినిధులతో కలిసి సంభాషించనున్నట్టు తెలిపారు. పలువురు సాంకేతిక నిపుణులతో చర్చలు ఉంటాయని వెల్లడించారు. ఈ పర్యటన విజయవంతం అవుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.

4న జమ్మూ కాశ్మీర్​లో ​ఎన్నికల ప్రచారం

రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4న జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌సీ – -కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల తరఫున ఆయన జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో రెండుచోట్ల సభలలో ప్రసంగిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ​నేత గులాం అహ్మద్ మీర్  వెల్లడించారు. శనివారం ఆయన అనంత్‌‌‌‌‌‌‌‌నాగ్​లో మీడియాతో మాట్లాడుతూ.. 

రాహుల్​ గాంధీ ఇక్కడ ప్రచారం చేయాలని కూటమి అభ్యర్థులతో పాటు జమ్మూ కాశ్మీర్​ ప్రజల కోరిక అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 4న రాహుల్​జమ్మూకాశ్మీర్​ను సందర్శిస్తారని.. అలాగే, కూటమి అభ్యర్థుల కోసం కాశ్మీర్​తో పాటు జమ్మూలో ఎన్నికల ప్రచార ర్యాలీలలో ప్రసంగిస్తారని ఆయన చెప్పారు.