Ganesh Chaturdhi 2025: మీ ఇంట్లో వినాయకుడిని ఇలా డెకరేట్ చేయండి.. లుక్ అదిరిపోద్ది..

Ganesh Chaturdhi 2025: మీ ఇంట్లో వినాయకుడిని ఇలా డెకరేట్ చేయండి.. లుక్ అదిరిపోద్ది..

వినాయక చవితి హడావిడి మొదలైపోయింది. ఏ వంటలు చేయాలి? ఎలాంటి విగ్రహం తెచ్చుకోవాలి? అనే డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి. బొజ్జ గణపయ్య మండపాన్ని అందరూ అలంకరించే దానికంటే డిఫరెంట్​ గా చేయాలి అనుకుంటారు చాలామంది. అందుకే, ఈ సారి బుల్లి గణపయ్య పీఠాన్ని రొటీన్​ కాకుండా ఇలా చక్కగా తీర్చిదిద్దండి.

గో గ్రీన్: చాలా ఏండ్ల నుంచి ...గో గ్రీన్ గణేశ....క్యాంపెయిన్ నడుస్తోంది. అందుకు, ఈమధ్య మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. అలానే ఆ మట్టి గణపయ్యను ఉంచే పీఠాన్ని కూడా చక్కగా గ్రీన్​ తో  నింపేయాలి. ఇనోడోర్ ప్లాంట్స్​ తో  గణపతి పీఠాన్ని చక్కగా తీర్చిదిద్దోచ్చు. ప్లేస్​ ను బట్టి మెటల్ ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలతో డెకరేట్ చేయొచ్చు.

వాల్ డెకరేషన్: పండుగ అనగానే ఇంటినిపూలతో అలంకరిస్తారు. కానీ, ఈసారి కొంచెం డిఫరెంట్ గా పూలతో కాకుండా ఎక్కువ రోజులు ఉండేలా పెయింటింగ్స్, వాల్ ఫ్రేమ్స్ డెకరేట్ చేసుకోవచ్చు. మార్కెట్లో రకరకాల ఫ్రేమ్స్, హ్యాంగింగ్స్ దొరుకుతున్నాయి. వాటితో గోడలను అలంకరించుకుంటే బాగుంటుంది.

చూడచక్కని పీట: గణపయ్యను పెట్టేందుకుతీసుకునే పీట కలర్​ ఫుల్​ గా  ఉండాలి. మంచి మంచి డిజైన్లు, రంగులతో పీటలు దొరుకుతున్నాయి. కాబట్టి వినాయకుడి విగ్రహం పెట్టే చోటు, గోడలకు ఉన్న రంగులను బట్టి పీటను సెలెక్ట్ చేసుకోవాలి. దాంతో పాటు దానిపైన వేసే మ్యాట్ కూడా కలర్​ ఫుల్​ గా  ఉండాలి.

Also Raed : ఏ ఆకారం విగ్రహానికి పూజలు చేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయి..!

పూలతో చక్కగా:  ఏ పండుగైనా. ..పూజైనా పూలు లేనిది పూర్తికాదు. వినాయకుడిని రకరకాల, రంగు రంగుల పూలతో అలంకరిస్తే భలే అందంగా ఉంటుంది. అందుకే, రంగు రంగుల పూలను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. వాటితో చక్కటి మాలను అల్లి వినాయకుడికి వేయొచ్చు. పీఠాన్ని అలంకరించొచ్చు. ఇంటి ముందు, పూజగది, పీఠం ఎదుట పూలతో డిజైన్లు, ముగ్గులు వేయొచ్చు.

లైట్లు, క్యాండిల్స్: డెకరేషన్స్ అన్నింటికీ లైట్లు,క్యాండిల్స్ అదనపు హంగులు ఇస్తాయి. దానికోసం దీపాలు, క్యాండిల్స్, స్ట్రింగ్ లైట్స్ వాడొచ్చు. పూల ముగ్గును కూడా దీపాలతో అలంకరించొచ్చు.