గోరోజనం ఎక్కువైంది : హనుమంతుడు దేవుడు కాదంట.. మరి ఏంటీ

గోరోజనం ఎక్కువైంది : హనుమంతుడు దేవుడు కాదంట.. మరి ఏంటీ

హనుమంతుడు దేవుడా కాదా.. ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశారు ఆదిపురుష్ రైటర్ మనోజ్ శుక్లా. సినిమాలో డైలాగ్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రచయిత.. మళ్లీ కొత్తగా ఓ వివాదాన్ని సృష్టించారు. ఆదిపురుష్ మూవీలో హనుమంతుడి డైలాగ్స్ విషయంపై ఓ జాతీయ ఛానెల్ లో మాట్లాడుతూ మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నెటిజన్లతో తిట్లు తింటున్నారు.

హనుమంతుడు దేవుడే కాదు :

హనుమంతులు అసలు దేవుడే కాదు.. ఆయన భక్తుడు మాత్రమే. రాముడికి వీర భక్తుడు. అంతేకానీ దేవుడు కాదు అంటూ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా.. అతని భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి.. అతడిని దేవుడిని చేశాం అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ లో తప్పేముందీ అంటూ సమర్ధించుకున్నారు కూడా. 
హనుమంతుడు అస్సలు దేవుడే కాదంటూ వాదించటం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అయ్యింది. ఇన్నాళ్లు హనుమంతుడు దేవుడు అంటూ గుళ్లు, గోపురాలు కట్టింది ఎందుకు.. ఆయన దేవుడు కానప్పుడు ఈ పూజలు, హోమాలు ఎందుకు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కావాలనే కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని.. కోట్ల మంది మనోభావాలను దెబ్బతీస్తున్నారని హిందూ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఓ చెత్త సినిమా తీసి.. దేవుళ్లనే దేవుళ్లు కాదనే స్థాయికి ఆదిపురుష్ రచయిత మనోజ్ శుక్లా వెళ్లారంటే.. ఎంత అహంకారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మనోజ్ శుక్లాకు గోరోజనం ఎక్కువైందీ అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

ఏది ఏమైనా ఆదిపురుష్ సినిమాలోని వివాదాలకు సమాధానం చెప్పకపోగా.. హనుమంతుడు అసలు దేవుడే కాదు.. కేవలం భక్తుడు మాత్రమే చెప్పటం ద్వారా.. ఇప్పుడు కొత్త చర్చ అయితే నడుస్తుంది. 

వీకెండ్ లో ఫుల్ కలెక్షన్ తో నడిచిన ఆదిపురుష్ సినిమా.. సోమవారం రోజు మాత్రం భారీ తగ్గాయి కలెక్షన్స్. ఊహించని విధంగా ధియేటర్లలో జనం లేకపోవటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు షాక్ అయ్యారు. సోమవారం కేవలం ఎనిమిదన్నర కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తో పోల్చితే 75 శాతం తగ్గటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.