
చిత్తూరు జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. చంద్రగ్రహణం ఎఫెక్ట్ దేవుళ్లకు కూడా ఉంటుందా.. అంటే ఘటనను పరిశీలిస్తే నిజమేనని అనిపిస్తుంది. ఐరాల మండలం ఓ దేవాలయంలో అమ్మవారి విగ్రహం చోరీకి గురైంది. పాలేటమ్మ విగ్రహాన్ని మహిళ దొంగిలించిదని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంత్రాలు చేసే ఓ మహిళ చిత్తూరు జిల్లా.. ఐరాల మండలంలోని పాలేటమ్మ విగ్రహాన్ని.. నలుగురు వ్యక్తుల సాయంతో ఓ మంత్రగత్తె దొంగిలించిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన.... ఐరాల పోలీసులు ..ఆ మహిళతో సహా మిగతా నిందితులను తనంపల్లి మండలంలో పట్టుకున్నారు. ఆ మహిళ మంత్రాలు చేసే మహిళ అని స్థానికులు ఆరోపిస్తున్నారు.