రాముడు మాంసాహారే.. ఎన్సీపీ నేత కీలక వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ

రాముడు మాంసాహారే.. ఎన్సీపీ నేత కీలక వ్యాఖ్యలు.. మండిపడ్డ బీజేపీ

శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 14ఏళ్లు అడవిలో ఉన్న శ్రీరాముడు శాకాహారిగా అడవిలో ఎలా ఉన్నాడని ప్రశ్నించారు. రాముడు బహుజన నేత అని, శాఖాహారి కాదని, ఆయన మాంసాహారి.. వేటగాడని కామెంట్స్ చేశారు. మరికొద్ది రోజుల్లో అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనున్న ఈ సమయంలో జితేంద్ర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

రాముడు తమ వాడేనని, తినడానికి జంతువులను వేటాడేవాడని.. కావున ఆయన ఎప్పటికీ శాకాహారి కాదని, మాంసాహారేనని జితేంద్ర వాదించారు. అడవిలో ఉన్న వ్యక్తి మాంసం తినకుండా ఎలా ఉంటాడని ప్రశ్నలు సంధించాడు.

ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ.. కోట్లాది మంది రామభక్తుల భావోద్వేగాలను అగౌరవపరిచారని ఆరోపించింది. రాముడు మాంసాహారి అని అన్నందుకు జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఇంత జరుగుతున్నా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దర్ థాకే మౌనంగానే ఉన్నారని బీజేపీ నేత రామ్ కదమ్ మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రేకు హిందువులు,మరాఠీల గురించి పట్టింపు లేదని, ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేయడానికే వారు ఆసక్తి చూపుతారని కదమ్ అన్నారు. ఈ టైంలో బాలా సాహెబ్ థాక్రే బతికుంటే అవద్ వ్యాఖ్యలను ఖండించేవారని చెప్పారు.