శ్రీ కృష్ణుడితోనే.. ప్రేమ లేఖలు పుట్టాయా.. ఫస్ట్ లవ్ లెటర్ ఎవరు ఎవరికి రాశారు...

శ్రీ కృష్ణుడితోనే.. ప్రేమ లేఖలు పుట్టాయా.. ఫస్ట్ లవ్ లెటర్ ఎవరు ఎవరికి రాశారు...

ల‌వ్ లెట‌ర్…జ‌నాల‌కు ఈ పేరు వినిపించ‌క చాలా కాలం అవుతుంది. కానీ ఒక‌ప్పుడు ప్రేమ‌లేఖ అంటే తెలియ‌ని వారుండ‌రు. కానీ ఇప్పుడు ప్రేమ‌లేఖ చ‌ద‌వాలంటే మ్యూజియం కు వెళ్లాలేమో అనిపిస్తుంది. కానీ ఒక‌ప్పుడు ప్రేమికులు త‌మ ప్రేమ‌ను మ‌రియు త‌మ మంచి చెడుల‌ను తెలుపుకునేందుకు ప్రేమ‌లేఖ‌ల‌ను రాసుకునేవారు. ప్రేమ‌లో ప‌డ్డారంటే క‌చ్చితంగా ప్రేమ‌లేఖ‌లు రాసుకునేవారు.  ప్రేమ‌లేఖ అంటే నేడు పంపుకుంటున్న మేసేజ్ ల మాదిరిగా కాకుండా త‌మ హావ‌భావాల‌ను అందంగా పంచుకుంటారు.  అసలు లోకంలో తొలి ప్రేమ లేఖ ఎవరు ఎవరికి రాశారో తెలుసుకుందాం. . . .

 ఆట, అల్లరి, స్నేహం, ప్రేమ, నాయకత్వం, బంధం..ఇలా ఏ కోణంలో చూసినా శ్రీకృష్ణుడే నంబర్ వన్. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏ రంగంలో అయినా నిష్ణాతుడు ఎవరంటే శ్రీ కృష్ణుడనే చెప్పాలి. ప్రేమను ఇవ్వడమే కాదు ప్రేమను అందుకోవడం కూడా వరమే. అప్పట్లో ప్రేమలేఖ అందుకున్నాడు కన్నయ్య. ఇంతకీ ఎవరి మనసు దోచాడంటే...

కృష్ణుడి కథలు వింటూ అతడిపైనే ప్రేమను పెంచుకుంది రుక్మిణి. విదర్భ రాజు భీష్మకుడి కుమార్తె అయిన రుక్మిణి అందంలోనూ, గుణంలోనూ తనకు తానే సాటి. ఆమె అనుకూల ప్రవర్తన కారణంగానే కృష్ణుడు తన అష్ట భార్యల్లో రుక్మిణి అంటే అంత అవిభాజ్యమైన ప్రేమను కురిపించాడు. కృష్ణుడిని వివాహం చేసుకోవాలన్న రుక్మిణి అభిప్రాయాన్ని తండ్రి గౌరవించినా, సోదరుడు రుక్మకు మాత్రం ఇష్టం లేదు. ఆమెను శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. దీంతో రుక్మిణి కలత చెందింది. శిశుపాలుడితో పెళ్లికి ముందు రోజు రాత్రి శ్రీకృష్ణుడికి లేఖ రాసి అత్యంత నమ్మకస్తురాలైన సునందకు ఇచ్చి పంపింది.

రుక్మిణి తాను రాసిన ప్రేమలేఖలో ఏముందంటే...ఓ కృష్ణా మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దు:ఖం నశించి, మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు. నా మనసులో నిరంతరం మీ ధ్యాసే, అందం, జ్ఞానం, యవ్వనం సంపదలో మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్తవయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్ఠమైన, మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి..తనకు ఇష్టంలేని వివాహం చేస్తున్నారని, అడ్డుకోవాలని తెలిపింది. కృష్ణుడు కూడా రుక్మిణి అందం గురించి తెలుసుకుని ఆమెను భార్యగా చేసుకోవాలని భావించినా భీష్మకుని మాత్రం సంప్రదించలేదు. ఆమె లేఖను అందుకున్న శ్రీకృష్ణుడి తన పరివారంతో కలిసి విదర్భ చేరుకుని రుక్మను ఓడించాడు. రుక్మకు శిరోముండనం చేసి, సగం మీసం తీసి పంపించాడు. రుక్మిణిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకుపోయిన కృష్ణుడి ఆమెను  వివాహం చేసుకున్నాడు.

రుక్మిణి తాను రాసిన ప్రేమలేఖలో ఇలా పేర్కొంది. ఓ కృష్ణా మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దు:ఖం నశించి, మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు. నా మనసు నిరంతం మీ ధ్యాసే కోరుతోంది. అందం, జ్ఞానం, యవ్వనం సంపద, ప్రభావంలో మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్తవయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్ఠమైన, మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి వేగంగా వచ్చి, నన్ను మీ భార్యగా స్వీకరించండి. కలువలాంటి కన్నులున్న నా ప్రియమైన దేవా, నక్క లాంటి శిశుపాలుడు సింహం సొత్తును ఎప్పటికీ తాకలేడని తెలిపింది.

ప్రేమ అనేది మనిషి పుట్టకముందు నుండి ఉంది అంటే నమ్మగలమా.. కానీ నమ్మాలి. ఎందుకంటే ప్రేమ .ఎప్పుడూ ఒకేలా ఉంటుందా… లేదా కాలానుగుణంగా మారుతుంది. ప్రేమ అనేది ఎన్నేళ్లైనా దానిని వ్యక్తం చేయడంలో కాస్త తేడా ఉంటుందేమోకానీ.. ప్రేమలో మాత్రం తేడా ఉండదని చెప్పాలి.