సీతారామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

సీతారామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసి దళాలతో అర్చన జరిగింది. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు విశేష అలంకరణలు చేసి బాలబోగం నివేదించాక అర్చన చేశారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. రామపాదుకలను భద్రుని మండపానికి తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకించారు. కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం వైభవంగా జరిగింది.

 శ్రీరంగంలోని ఆశ్రమానికి చెందిన పుండరీ పుర స్వామి రామయ్యను దర్శించుకున్నారు. హైకోర్టు జడ్జి కాజా శరత్​ కుటుంబ సమేతంగా రామాలయంలో పూజలు చేశారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత స్వామివారికి రాజబోగం నివేదించారు. సాయంత్రం బేడా మండపంలో దర్బారు సేవలో దివిటీ సలాం ఇచ్చారు.