Ganesh Chatrudhi 2025: దేవుళ్లు పూజించే వినాయకుడి పూజకు ఏం ఏం కావాలి.. ఎలా సిద్దం చేసుకోవాలి..

Ganesh Chatrudhi 2025: దేవుళ్లు పూజించే వినాయకుడి పూజకు  ఏం ఏం కావాలి.. ఎలా సిద్దం చేసుకోవాలి..

ముక్కోటి దేవుళ్లలో వినాయకుడు ప్రత్యేకం...  త్రిమూర్తుల దగ్గర్నుంచి అందరు దేవుళూ వినాయకుడ్ని పూజించినవాళ్లే ఏ పని మొదలు పెట్టినా.  ఏ విఘ్నాలూ రాకుండా చూడవయ్యా గణేశా!" అని వినాయకుడి తొలిపూజ చేస్తారు.   అలా మనం చేసే పనుల్లో అడ్డంకులు రాకుండా, అన్ని విఘ్నాలను తొలిగించే దేవుడు కాబట్టి, 'విఘ్నాదిపతి' అన్న పేరుంది వినాయకుడికి శివుడు కూడా ఏదైనా పని మొదలు పెట్టి ముందు వినాయకుడికి పూజ చేసే మొదలు పెడతాడని పురాణాల్లో ఉంది. అలాంటి మన విఘ్నాధిపతికి ప్రతి ఏటా వైభవంగా జరిపి వినాయక చవితి పండుగను హిందువులు ఆగస్టు 27 బుధవారం జరుపుకుంటున్నాము. 

పూజకు కావాల్సిన సామాగ్రి

  • పసుపు
    ఒక తువాలు
  • కుంకుమ
  •  గంధం
  •  అగరవత్తులు
  • కర్పూరం
  • తమలపాకులు
  • వక్కలు
  • పూలు
  • పూల దండలు
  •  అరటి పండ్లు
  • కొబ్బరికాయలు
  •  బెల్లం లేదా చక్కర
  • పంచామృతం
  • తోరణం
  •  కుందులు
  •  నెయ్యి
  • నూనె
  • దీపారాధనకు వత్తులు
  • 21 రకాల ఆకులు (పత్రి)
  • ఒక గ్లాసులో చెంచా
  • దక్షిణ 

పూజకు ఎలా సిద్దం చేసుకోవాలంటే..

  • ప్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసుకోవాలి. 
  • పూజ చేసుకొనేవారు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి
  • వినాయకుడి విగ్రహానికి పసుపు రాసి, తమలపాకుల చివర తూర్పు వైపునకుగానీ, ఉత్తరం వైపునకు గానీ ఉంచుకోవాలి. 
  • ఒక పళ్లెంలో బియ్యం పోసుకొని వాటిపై తమలపాకులను పెట్టుకోవాలి
  •  అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసిన తరువాత పీటపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకొని, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరునితలపై వచ్చేలా తాళ్లు కట్టి మైన కట్టుకోవాలి. 
  • పాలవెల్లిపై పత్రి వేసుకొని పాలవెల్లి  నలువైపులా మొక్కజొన్న పొత్తులను కట్టుకొని, పండ్లతో అలంకరించుకోవాలి. 
  • వినాయకుడికి ఉండ్రాళ్లు కుడుములు, గారెలు, పాయసం మొదలైన పిండివంటలు చేసుకొని దగ్గర పెట్టుకోవాలి.
  •  వినాయకుడి విగ్రహం ఎదురుగా పీటపై కొన్ని బియ్యం పోసుకొని దానిపై రాగి, వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, పాత్రపై జాకెట్టు గుడ్డవేసి, కొన్ని మామిడాకులు ఉంచి దానిపై కొబ్బరికాయ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి.. ( కుటుంబంలో ఆచారం ఉంటే) 

►ALSO READ | Ganesh Chatrudhi 2025: వినాయక పూజ ఎలా చేయాలి.. ఏఏ మంత్రాలు చదవాలి.. పూజా విధానం ఇలా..!