లారీలకు సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలి.. రాష్ట్ర లారీ ఓనర్స్ సంఘం డిమాండ్

లారీలకు సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలి.. రాష్ట్ర లారీ ఓనర్స్ సంఘం డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: లారీలకు సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు సి. అంజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గా ప్రసాద్ కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్ లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నాటకలో లీటర్​ డీజిల్​పై రూ .12 తగ్గించినట్లు చెప్పారు.

లారీ ఓనర్ల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలకే తాము మద్దతిస్తామని తెలిపారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసి, ఫిట్ నెస్ గ్రీన్ ట్యాక్స్ ను రద్దు చేయాలన్నారు. తెలంగాణలో  ఉన్న బోర్డర్​ చెక్​పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. హెవీ లైసెన్స్​ కలిగిన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్​ కల్పించాలని, ప్రతి జిల్లాలో హెవీ డ్రైవింగ్​ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వెల్లడించారు.

ట్రక్​ పార్కింగ్​ కోసం స్థలాలను కేటాయించాలని పేర్కొన్నారు. సమావేశంలో లీగల్​సెల్​అడ్వైజర్  ఎమ్.మదన్​మోహన్​, క్రమశిక్షణ విభాగం చైర్మన్​ కె.నాగేశ్వరరావు,  సయిద్​ఫాయాజ్​అలీ, ఉపాధ్యక్షులు పి.జగన్నాథ్​రెడ్డి,  సమ్మిరెడ్డి, సలావుద్దీన్​, రవి, జనార్దన్​ పాల్గొన్నారు.