పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

గుంటూరు: పల్నాడులో  ప్రేమజంట ఆత్మ ఆత్మహత్యాయత్నం చేసింది. గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాచేపల్లి మండంల భట్రుపాలెంలో శనివారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన శ్రీకాంత్ కాలేజీలో తనతోపాటు చదివే గురజాల మండలం అంబాపురం గ్రామానికి చెందిన నాగవర్ధిణి ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెబితే ప్రేమ పెళ్లికి సుముఖంగా లేరని గుర్తించిన ఇరువురు ఇవాళ శనివారం శ్రావణమాసం కావడంతో మంచి రోజుగా భావించి దాచేపల్లి కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నారు. 
పెళ్లి చేసుకున్న విషయం తెలుపగా తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో  శ్రీకాంత్, నాగవర్ధిణి ఇద్దరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భట్రాజుపాలెం సమీపంలోని కృష్ణా నది ఒడ్డుకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గుర్తించిన స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేసి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ఇరువురి పరిస్థితి విషమంగానే ఉందని.. ఆస్పత్రి వర్గాల సమాచారం.