Love Guru Family Trip: ఆడియన్స్కు బంపర్ ఆఫర్.. లవ్ గురు చూడండి మలేషియా వెళ్ళండి

Love Guru Family Trip: ఆడియన్స్కు బంపర్ ఆఫర్..  లవ్ గురు చూడండి మలేషియా వెళ్ళండి

ఈమధ్య సినిమాలు తీయడం కన్నా.. ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడమే కష్టమైపోయింది. అందుకోసం చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. కొందరు ప్రమోషన్స్ వినూత్నంగా ప్లాన్ చేస్తుంటే.. మరికొందరేమో బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళ మూవీ లవ్ గురు(Love Guru) మేకర్స్ ఇదే ఇండియాని ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ ను అతి తక్కువ ధరకే ఇస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అదేంటంటే.. ఈ సినిమా థియేటర్స్ లో చూసే ప్రేక్షకులకు ఫ్యామిలీ ట్రిప్ ను అందిస్తున్నట్లు ప్రకటించారు. అందులో మొదటి ఫ్రైజ్ విజేతకు మలేషియా, రోండో విజేతకు కశ్మీర్, మూడో విజేతకు ఊటీ ట్రిప్స్  తీసుకెళ్తామని లవ్ గురు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ ఆఫర్ నేటి(14-04-2024) నుండి అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రేక్షకులు చేయాల్సిన పని ఏంటంటే.. లవ్ గురు సినిమాను థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులు వారి వివరాలు రాసి థియేటర్స్ లో ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది.

ఒకేవేళ.. ఆన్‌లైన్ టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులు.. 9963466334 నంబర్‌కు తమ టికెట్ ఫోటోను వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. అందులో నుండి కొంతమందిని విజేతలుగా ప్రకటించి సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా అందజేయనున్నారు లవ్ గురు మూవీ టీమ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఆఫర్. ఇంకెందుకు ఆలస్యం వీలుంటే మీరు కూడా ట్రై చేయండి.. హాలీడే ట్రిప్ గెలుచుకోండి.