Baak Song Release: కళ్లుచెదిరే అందాల విందు.. గ్లామర్ షోతో రెచ్చిపోయిన తమన్నా, రాశీ

Baak Song Release: కళ్లుచెదిరే అందాల విందు.. గ్లామర్ షోతో రెచ్చిపోయిన తమన్నా, రాశీ

అరణ్మనై ఫ్రాంచైజీలో తాజాగా వస్తున్న మూవీ అరణ్మనై 4 (Aranmanai 4). హారర్ అండ్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో బాక్ (BAAK) టైటిల్‌తో విడుదలకు సిద్దమయింది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. 

ఇందులో భాగంగానే బాక్ సినిమా నుండి పంచుకో అంటూ సాగె పాటను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న తమన్నా, రాశీఖన్నా లపై ఈ కలర్‌ఫుల్‌ పాటను తెరకెక్కించారు. ఇక ఈ పాటలో ఇద్దరు భామలు తమ అందాలతో ఆడియన్స్ కు కనువిందు చేశారు. పొట్టి పొట్టి డ్రెస్సులతో పోటీపడుమరీ అందాలను ఆరబోశారు. గ్లామర్ తో రచ్చ చేశారు. దాంతో.. ఈ పాట చూసిన ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.   

ఇక ఈ సినిమాలో కోవై సరళ, వెన్నెల కిశోర్‌, ఢిల్లీ గణేశ్‌, శ్రీనివాసరెడ్డి కీ రోల్స్ చేస్తున్నారు. అన్వి సినీమాక్స్, బెంజ్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హాఫ్ తమిజా సంగీతం అందిస్తున్నారు. మరి టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తరువాత ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.