The Family Star OTT: OTTకి రానున్న ది ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

The Family Star OTT: OTTకి రానున్న ది ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). దర్శకుడు పరశురామ్(Parasuram) తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మర్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. రొటీన్ స్టోరీ, కథనం కూడా కొత్తగా లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది ఈ మూవీ.

సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ది ఫ్యామిలీ స్టార్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మే 3నుండి స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారట. ఇదే విషయం త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విజయ్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.