తన భాగస్వామితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన స్టార్‌ స్ప్రింటర్‌

తన భాగస్వామితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన స్టార్‌ స్ప్రింటర్‌

భారత జట్టు మహిళా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. తన భాగస్వామి మోనాలిసాతో కలిసి సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న ఒక పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాంతో పాటు లవ్ ఈజ్ లవ్ అనే క్యాప్షన్ ను కూడా ఈ ఫొటోకు జత చేశారు. ఈ ఫొటోలో ద్యుతి నీలి రంగు నీలిరంగు జాకెట్, ప్యాంటు ధరించగా.. మోనాలిసా ముదురు నీలం రంగు ఎంబ్రాయిడరీ సంప్రదాయ దుస్తులను ధరించారు. అయితే ఈ ఫొటో ద్యుతి సోదరి వివాహ వేడుకలో తీసుకున్నట్టు తెలుస్తోంది.

ద్యుతి చంద్ స్వలింగ సంపర్కంలో ఉన్నట్లు ప్రకటించిన మొదటి భారతీయ క్రీడాకారిణి రికార్డు సృష్టించారు. 2019 మేలో ఒడిశాలోని తమ గ్రామానికి చెందిన మోనాలిసాతో ఉన్న సంబంధాన్ని వెల్లడించిన ధ్యుతి.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. గతంలో ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అందుకే తన తల్లిదండ్రులు తనను దూరంగా ఉంచారంటూ అప్పట్లో ద్యుతి సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. దాంతో పాటు తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానంటూ స్టార్‌ స్ర్పింటర్‌ వాపోయారు. ఒకరు ఎప్పుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడొచ్చని, కులం, మతం లేదా లింగం ఆధారంగా నిర్ణయించలేమని ద్యుతి చంద్ జూలై 2020లో చెప్పారు.