Love me movie OTT: OTTలోకి కొత్త సినిమా.. నెలలోపే వచ్చేస్తోంది?

Love me movie OTT: OTTలోకి కొత్త సినిమా.. నెలలోపే వచ్చేస్తోంది?

యంగ్ హీరో ఆశిష్(Ashish), బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్(Love me). ఘోస్ట్ లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. దెయ్యంతో ప్రేమ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది ఈ మూవీ. 

తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. ప్రెజెంటేషన్ లో క్లారిటీ మిస్ అవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో కలెక్షన్స్ కూడా అదే లెవల్లో రాబట్టింది ఈ మూవీ. దాంతో.. ఈ సినిమాను అనుకున్న టైమ్ కన్నా ముందే ఓటీటీకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. లవ్ మీ మూవీ ఓటీటీ హక్కులను చేసుకున్న ఆహా సంస్థ.. జూన్ 15 లేదా 22న స్ట్రీమింగ్ చేయనుందట. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇక లవ్ మీ సినిమా కథ విషయానికి వస్తే.. అర్జున్(ఆశిష్) ఒక యూట్యూబర్. దెయ్యాలు లేవని వీడియోలు చేస్తూ ఉంటాడు. అతనికి ఒకరోజు దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. అది తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని ఓ ఊరిలో ఉందని తెలిసి అన్నయ్య ప్ర‌తాప్‌( ర‌వికృష్ణ‌)తో క‌లిసి వెళతాడు. అక్కడికి వెళ్ళాక ఎం జరిగింది? అర్జున్ దివ్యవతిని ఎందుకు ప్రేమించాడు? ఈ కథకి వైష్ణవి చైతన్యకి ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.