ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తే..లవ్‌‌ ఓటీపీ

ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తే..లవ్‌‌ ఓటీపీ

అనీష్, జాన్విక, స్వరూపిణి  హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘లవ్‌‌ ఓటీపీ’. అనీష్ దర్శకత్వంలో భవప్రీతా ప్రొడక్షన్స్‌‌ బ్యానర్‌‌‌‌పై  విజయ్‌‌ యం రెడ్డి నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌గా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఒకరికి తెలియకుండా మరొకరిని  ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించి ఇబ్బందిపడే అబ్బాయిల కథే ఈ సినిమా.  

ప్రేమంటే అస్సలు పడని నాన్న పాత్రలో పోలీసాఫీసర్‌‌గా రాజీవ్‌‌ కనకాల నటించారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత విజయ్ మాట్లాడుతూ ‘ఫ్రెష్ కంటెంట్‌‌తో  ఎవరూ ఊహించని ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ని ప్రేక్షకుల  ముందుకు తీసుకొస్తున్నాం. ఓ కొత్త రకం తండ్రి కొడుకుల బాండింగ్‌‌ను చూస్తారు’ అని చెప్పారు.  ప్రమోదిని, తులసి, అన్నపూర్ణ, చేతన్‌‌ గంథర్వ, రవి భట్‌‌ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆనంద్ రాజా విక్రమ్ సంగీతం అందిస్తున్నాడు.