ఇండో–చైనా సంబంధాల మెరుగుకు కృషి చేస్తా: ట్రంప్

ఇండో–చైనా సంబంధాల మెరుగుకు కృషి చేస్తా: ట్రంప్

వాషింగ్టన్: ఇండియా–చైనా మధ్య ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి సాధ్యమైనంతగా కృషి చేయడానికి తాను సిద్ధమేనని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ‘ఇండియాతోపాటు చైనా ప్రజలను తాను ప్రేమిస్తానని ట్రంప్ అన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి సాధ్యమైనంతగా తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు’ అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెకెన్నీ గురువారం న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.

‘ఇండియా మాకు గొప్ప భాగస్వామి. వాళ్లు మాకు అతి ముఖ్యమైన పార్ట్‌నర్. ఇండియా ఫారెన్ మినిస్టర్‌‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మేం విస్తృత శ్రేణిలో పలు విషయాల గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. చైనాతో బార్డర్‌‌లో ఇండియా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన గురించి మేం చర్చించాం. చైనా టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల నుంచి వచ్చే ప్రమాదం గురించి కూడా మేం మాట్లాడాం’ అని మైక్ పాంపియో చెప్పారు.