అతడే టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం

అతడే టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం

ఆస్ట్రేలియా గడ్డపై రాణించిన నయా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణమని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ అన్నాడు. కంగారూలతో టెస్టుల్లో రాణించిన ఛటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్‌‌లను హస్సీ మెచ్చుకున్నాడు. బ్రిస్బేన్ మ్యాచ్‌‌లో పుజారా చూపించిన ధైర్య, సాహసాలు అద్భుతం. అది చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్. భారత్‌‌ను ఆలౌట్ చేయగలమన్న ఆసీస్ బౌలర్ల నమ్మకాన్ని అతడు నీరుగార్చాడు. పుజారా ఇచ్చిన ప్రోద్బలంతో గిల్, పంత్ కుమ్మేశారు. వాళ్లు అటాకింగ్ చేయడానికి పుజారానే కారణం. గిల్ చాలా బాగా ఆడుతున్నాడు. అతడు భావి ఇండియన్ ప్లేయర్‌‌గా కనిపిస్తున్నాడు. అతడు ఆడే తీరు బాగుంది. ఇంకా పంత్ గురించి చెప్పేదేముంది.. నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్‌‌ల్లో అదొకటి’ అని హస్సీ చెప్పాడు.