షాద్నగర్లో ఇంట్లో ఉరేసుకున్న ప్రేమ జంట .. అసలేం జరిగింది..?

షాద్నగర్లో ఇంట్లో ఉరేసుకున్న ప్రేమ జంట .. అసలేం జరిగింది..?

హైదరాబాద్ కు కూతవేటు దూరంలో.. షాద్ నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిస్కెట్ కంపెనీలో పనిచేసే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సోమవారం (డిసెంబర్ 01) ప్రేమికులిద్దరూ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలోని పదవ వార్డులో ఓ ఇంట్లో ఉంటున్న ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం వరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటి వారు కిటికీలోంచి చూడగా ప్రేమికులిద్దరూ ఫ్యానుకు వేలాడుతూ కనిపించినట్లు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపి తెలిపారు. 

యువకుడి పేరు ధనంజయ్ కాగా యువతి పేరు అనామిక అని, వీరిద్దరూ  స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తుంటారని చెప్పారు. ఇద్దరినీ బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.