
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఒరిస్సా తీరానికి సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఉప్పాడ తీరం దగ్గర సముద్రం అల్లకలోలంగా మారింది. తీరం దగ్గర అలలు ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలో ఉప్పాడ-కాకినాడ రూట్లో రాకపోకలకు అంతరాయం ఎరపడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. అల్పపీడనం ప్రభావంతో బుధవారం ( ఆగస్టు 27 ) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.
ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని తెలిపింది వాతావరణ శాఖ.