బంగాళాఖాతంలో అల్పపీడనం : 8వ తేదీ వరకు తెలంగాణ మొత్తం వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : 8వ తేదీ వరకు తెలంగాణ మొత్తం వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడింది. 2023, సెప్టెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారిందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ.. దక్షిణ ఒడిశా, దక్షిణ చత్తీస్ ఘడ్ మీదుగా పయనిస్తుందని.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 8వ తేదీ వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది విశాఖ వాతావరణ శాఖ. 

సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజులు అంటే.. సెప్టెంబర్ 9వ తేదీ వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తెలంగాణలో అయితే సెప్టెంబర్ 7వ తేదీ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని.. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో అంటే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొ్ండ, మహబూబాబద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ALSO READ :మూసాపేట్ మునిగింది.. వరదలతో పబ్లిక్ అవస్థలు

 

ఇక కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ మహబూబునగర్, కరీంనగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయంని వెల్లడిస్తూ.. ఎల్లో అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్ మెంట్.

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో ఈదురుగాలతో వర్షాలు పడతాయని.. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లగా ఉంటుందని.. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని కూడా వివరించింది.